
పయనించే సూర్యుడు: ఏప్రిల్ 14: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏప్రిల్.14 తేదీ సోమవారం డాక్టర్,బి. ఆర్.అంబేద్కర్ 134వ జయంతి కార్యవేడుకలు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వాజేడు లో వైద్యాధికారి మధుకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మధుకర్ మాట్లాడుతూ, బావి భారత ఫల ప్రదాతకి అశ్రునివాలని, జగతి ఉన్నంతవరకు మీ అమూల్యమైన రాజ్యాంగ నిర్మాణం,మీ త్యాగం భారతదేశ ఉన్నంతవరకు చిరస్థాయిగా నిలిచిపోతుందని, నేటి తరానికి కాకుండా భావి తరాలకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు ఉపయోగపడతాయని ఆయన రాసిన భారత రాజ్యాంగం తరతరాలుగా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. ఈయొక్క కార్యక్రమంలో వైద్యాధికారి మధుకర్, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి,స్టాఫ్ నర్స్, మంగ,మానస. అనుష. మరియు వైద్యశాలకు వచ్చినవారు,తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
