
సీజనల్ వ్యాధులపై పలు కీలక సూచనల చేసిన వాజేడు వైద్యాదికారులు.
పయనించే సూర్యుడు; జులై 01: ములుగుజిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం వైద్యాధికారుల ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో వైద్యాధికారి మాట్లాడుతూ సీజన్ వ్యాధుల పట్ల అప్రమత్తం గా ఉండాలని, ఇంటింటి సర్వే నిర్వహించి మలేరియా డెంగ్యు ను నిర్మూలించాలని
వారానికి రెండు సార్లు డ్రై డే ప్రోగ్రాం నిర్వహించాలని పరిసరాల పరిశుభ్రత గ్రామపంచాయతీ సిబ్బంది వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు సన్మనయంతో
సర్వే డెంగ్యూ దోమ కుట్టకుండా మరియు పుట్టకుండా చూసుకోవాలని సూచించారు.అంతేకాకుండా జ్వరం వచ్చిన వెంటనే రోగులను వైద్యశాలకు తీసుక రావాలని, మధుమేహం, రక్త పోటు,క్యాన్సర్ వంటి లక్షణాలను ముందుగా ఆశా కార్యకర్తలు గుర్తించి వారికి నెలసరి మందులు అందజేయాలని ఇళ్లల్లో నిలువ నీరుపారబోయాలని డ్రమ్ములపై మూతలు పెట్టుకోవాలని గర్భవతులను ఆరోగ్య కేంద్రంలో నమోదు చేయాలని కాన్పుకి వైద్యశాలకు ఆశ కార్యకర్తలు తీసుకురావాలని తెలిపారు. వైద్య అధికారి వైద్య సిబ్బందికి మరియు ఆశా కార్యకర్తలకు సమావేశంలో ఆదేశించడం జరిగిందనీ తెలియజేశారు. అనంతరం జులై 01 ప్రపంచ వైద్యుల దినోత్సవం కావడం తో ఆరోగ్యకేంద్రం లోని సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ కొమరం మహేందర్ మరియు డాక్టర్ మధుకర్ కి వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగినదని తెలియజేశారు.
