రుద్రూర్, అక్టోబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రుద్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు రుద్రూర్ ఎస్సై సాయన్న చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపి శ్రీనివాస్,రుద్రూర్ సీఐ కృష్ణ, ఫుడ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, క్రీడాకారులు, కళాశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.


