Saturday, April 5, 2025
Homeఆంధ్రప్రదేశ్వాల్మీకి,బోయల్ని మా జాతిలోకి వద్దు,మీ కులాలలో కలుపుకొండి:ఆదివాసీ పార్టీ

వాల్మీకి,బోయల్ని మా జాతిలోకి వద్దు,మీ కులాలలో కలుపుకొండి:ఆదివాసీ పార్టీ

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ది 22.03.2025 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ చింతూరు ల్మీకి,బోయల్ని మా జాతిలోకి వద్దు,మీ కులాలలో కలుపుకొండని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు.అనాదిగా అడవుల్లోనే బ్రతుకుతున్న ఆదివాసీల జీవితాలను ప్రభుత్వాలు ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని,1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నుండి ఏదో ఒక కులాన్ని తీసుకొచ్చి గిరిజన జాబితాలో కలుపుతూనే ఉన్నారు.రాజ్యాంగం అమల్లోకి వచ్చిననప్పుడు దేశంలో ఉన్న ఆదివాసీలలో 200 ఉపజాతులుండగా ఏదో కులాన్ని గిరిజన జాబితాలో కలపడం వల్ల నేడు 700 పై చిలుకు ఉపజాతులు ఉన్నాయని,1950 జనవరి 26 నాటికి గిరిజన రిజర్వేషన్ 4 శాతం ఉండగా వేరే వేరే కులాలను గిరిజన జాబితాలో కలుపుతూ గిరిజన రిజర్వేషన్ 6 శాతం చేసారు, కానీ ఈ 6 శాతం రిజర్వేషన్ కూడా ఎవరైతే వేరే కులాలనుండి కలపబడ్డారో వారే అనుభవించడం జరుగుతుందని,నిజమైనా ఆదివాసీలకు నష్టం జరుగుతుందని,వేరే కులాల నుండి గిరిజన జాబితాలో కలిపినవారు ఒక ఎత్తు అయితే గిరిజన ఆడపిల్లలను గిరిజనేతరులు పెళ్లి చేసుకుని,గిరిజనుల పేరుతో కొంతమంది,గిరిజనులతో సంబంధమే లేకుండా మరికొంతమంది బోగస్ గిరిజనులు గిరిజన రిజర్వేషన్ ను యోగించుకొంటున్నారు.
దీనివల్ల నిజమైన ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతోందని,పాలకులు ఆలోచించాలని,అంతే కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం వల్ల అమాయక ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతోందని,ఆంధ్రప్రదేశ్ లో గిరిజన జనాభా సుమారు 28 లక్షల మంది ఉండగా 50 లక్షల మంది పై చిలుకు వాల్మీకి బోయలను గిరిజన జాబితాలో కలిపితే,గిరిజన జాబితాలో వాల్మీకి బోయల్ని కలిపినట్లు కాదని, గిరిజనులను వాల్మీకి బోయల్లో కలిపినట్లు ఉంటుందని,తోడేళ్ళ మందలోకి మేకల్ని కలిపితే ఏ విధంగా తోడేళ్ళు మేకల్ని చంపుతాయో ఆ విధంగా ఆదివాసీల పరిస్థితి ఉంటుందని,వేరే కులాలలో ఉన్న వెనకబడిన ప్రతి కులం గిరిజన హోదా కోరుకోవడం మామూలైపోయిందని,అదే 15 శాతం రిజర్వేషన్ ఉన్న దళితులలో కలపని ఎవరూ అడగరు, ఒకవేళ కలిపిన దళితులు ప్రభుత్వాలనే మార్చేస్తారనే భయం ఉందని,గతంలో 2017 డిసెంబర్ 2 న తెదేపా ప్రభుత్వం,2023 మార్చి 25 న వైయస్సార్ సిపి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.ఇది ముమ్మాటికి ఓట్లు కోసమేనని,కానీ,ఏ ఆదివాసేతర రాజకీయ పార్టీ కూడా వాల్మీకి బోయలను గిరిజన జాబితాలో కలిపొద్దని మాట్లాడక పోవడం బాధాకరం.అంటే ఏ ఆదివాసేతర రాజకీయ పార్టీ కూడా ఆదివాసీల పక్షాన నిలబడదా,తెదేపా,వైయస్సార్ సిపి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటే ఆయా పార్టీలలో ఉన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు మాట్లాడలేకపోవడం బాధాకరం.ఎదురు తిరిగితే మరోసారి టికెట్ ఇవ్వరనే భయంతో మాట్లాడలేకపోతున్నారు,రెండోసారి టిక్కెట్ ఇచ్చిన ఉపయోగంలేదన్న విషయం ఓడిపోయిన తర్వాత ఆదివాసీ ఎమ్మెల్యేలకు తెలుస్తుంది.ప్రస్తుతం వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తమ పలుకుబడిని వారి కులం కోసం ఉపయోగిస్తున్నారు,ఆదివాసీ ఎమ్మెల్యేలు,కూటమి నాయకులు ఆదివాసి జాతి కోసం ఏం చేస్తారో నని ఆదివాసీలు ఎదురు చూస్తున్నారని,భారత్ ఆదివాసీ పార్టీ ఆదివాసీల పక్షాన నిలబడి పోరాడుతుందని,భారత్ ఆదివాసీ పార్టీ ఎంపీ రాజ్ కుమార్ రోత్ పార్లమెంటులో ఉన్న 47 మంది గిరిజన ఎంపీలతో పాటు మిగతా ఎంపీలతో, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో, రాష్ట్రపతితో కలిసి వాల్మీకి బోయలను గిరిజన జాబితాలో కలపొద్దని కోరుతారని రాజబాబు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments