
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 3(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి దసరా నవరాత్రుల అనంతరం వసంతోత్సవాలు నిర్వహించారు శ్రీ నాగలింగేశ్వర స్వామి మెరిగిరి బావి శివాలయం వరకు వెళ్లి అక్కడ పూజారి కార్యక్రమాలు నిర్వహించి ఆటపాటలతో అల్పాహారం స్వీకరించి వసంతాలు రంగులు చల్లుకుంటూ యాడికి పురవీధుల్లో ఖడ్గమాలలు చెప్పుకుంటూ అమ్మవారికి ప్రసాదాలు స్వీకరించుకుంటూ భక్తి పాటలతో డీజే కార్యక్రమం ఏర్పాటు చేసి గుంపులు గుంపులుగా ఊరేగింపుగా అమ్మవారి శాలకు చేరుకున్నారు అక్కడ విందు భోజనాలు స్వీకరించి సాయంత్రం ఏడు గంటలకు పవళింపు సేవ డోలోత్సవం నిర్వహిస్తామని ఆర్య వైశ్య సంఘ సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య సంఘం,ఆర్యవైశ్య యువజన సంఘం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

