
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 7(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో కౌముది పౌర్ణమి సందర్భంగా ప్రతి పౌర్ణమి లాగానే 11 దంపతుల చేతుల మీదగా శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు పెద్ద ఎత్తున వచ్చిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు శ్రీ రమా సత్యనారాయణ స్వామికి జై అంటూ ఆలయ ప్రాంగణమంతా మారు మోగింది. ఈ కార్యక్రమం యాడికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

