

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 25 నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ :తెలంగాణ నిజామాబాద్ జిల్లా — సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నూడ చైర్మన్ కేశ వేణు అధ్యక్షతన అర్బన్ నియోజకవర్గ జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా అర్బన్ నియోజకవర్గ కార్యక్రమ ఇన్చార్జి, సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి,కార్యక్రమ రాష్ట్ర ప్రతినిధి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొప్ప కార్యక్రమం అని ,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి ప్రజల వద్దకు వెళ్లి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు స్వాతంత్రం వచ్చిన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు అందించిన అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా, అదే విధంగా దేశంలో బిజెపి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యాంగాన్ని అవమానిస్తూ కించపరుస్తూ వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేస్తూ, అప్రజస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని సత్యనారాయణ అన్నారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు ఎంత పని చేస్తున్నారు అనేది పరిశీలించడానికి నన్ను ఇన్చార్జిగా నిజామాబాద్ అర్బన్ బోధన్ నియోజకవర్గం నియమించడం జరిగిందని, కావున కార్యక్రమం పూర్తి అయ్యేవరకు ప్రతిదీ పరిశీలించి అధిష్టానానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పని చేయాలని కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మనం చేసిన పనులను ప్రజలకు వివరించడానికి ఉపయోగపడుతుందని, తద్వారా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుందని సత్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతారెడ్డీ రాజారెడ్డి,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావేద్ అక్రమ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గోపి,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, అబ్దుల్ ఏజజ్, బొబ్బిలి రామకృష్ణ, తంబకు చంద్రకళ,పోల ఉష, విజయలక్ష్మి, అంతఃరెడ్డి విజయ్ పౌల్ రెడ్డి,వినయ్,యెండల కిషన్,జియా, నరేందర్ గౌడ్, లవంగ ప్రమోద్, సంగెం సాయిలు, మరియు తదితరులు పాల్గొన్నారు