
ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 6 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామలోని విఐపి పబ్లిక్ స్కూల్లో ఈరోజు ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క మార్గదర్శకంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్నప్పటి నుంచే తమ యొక్క లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటి వైపు వెళ్లే ప్రయత్నాలు చేయాలని విద్యార్థులు ఇష్టపడి చదివితే తమ అనుకున్న లక్ష్యాలను కచ్చితంగా చేరుకుంటారని అన్నారు విద్యతోపాటు ఆటపాటలలో ప్రతి ఒక్క విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ నరేష్ స్కూల్ ప్రిన్సిపల్ వెంకటకృష్ణ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.
