
గ్రామీణ ప్రాంత మరియు వ్యవసాయ రంగంపై ప్రత్యేక అనుభవం
విద్యార్థులకు ఆచరణాత్మక అభ్యాస అనుభవాన్ని అందించడమే లక్ష్యం
ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణ
( పయనించే సూర్యుడు ఆగస్టు 02 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని ఇప్పలపల్లి లోని విఐపి పాఠశాలలో ఈ రోజు “వన్ డే కిసాన్” అనే కార్యక్రమం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణ మీడియాకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల జీవితం మరియు వ్యవసాయం గురించి స్వయంగా అనుభవాలను విద్యార్థులకు తెలియజేయడానికి మరియు స్వయంగా అనుభవాలు కలగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు ఆచరణాత్మక అభ్యాస అనుభవాన్ని అందించడమే లక్ష్యం అన్ని ప్రధానోపాధ్యాయులు వెంకట కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో 7 నుండి 9 తరగతి చదువుతున్న విద్యార్థులు మరియు పి ఈ టి రాజన్ తదితరులు పాల్గొన్నారు.
