
పయనించే సూర్యుడు,ఆగస్టు,26,ఆదోని టౌన్ రిపోర్టర్ గుమ్మల బాలస్వామి
రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల పెన్షన్లను తొలగింపును విరమించుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో,పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని కమిషనర్ కు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్,మల్లయ్య.సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు పీఎస్ గోపాల్,తిప్పన్న,పట్టణ నాయకులు,నాగరాజ్ ,వీరేష్ మీరు మాట్లాడుతూ గతంలో జగన్ ప్రభుత్వం వికలాంగులకు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిందని సంవత్సరం కిందట కూటమి ప్రభుత్వం డాక్టర్లతో వెరిఫికేషన్ చేసి పర్సంటేజ్ ద్వారా వికలాంగులు పెన్షన్ పొందుతున్నారని అన్నారు. మరి ఇప్పుడు కొత్తగా పర్సెంటేజ్ తక్కువగా ఉందని కమిషనర్ ఆధ్వర్యంలో నోటీసులు పింఛన్ రద్దు చేస్తామని వికలాంగులకు ఇవ్వడం వలన వికలాంగులు చాలా ఆందోళన చెందుతున్నారని అన్నారు. వికలాంగులు వీరి మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. పింఛను రద్దు కావడం వలన చాలా ఆర్థిక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అరకులైన వికలాంగులందరికీ పెన్షన్లు ఇవ్వాలని రద్దు చేయాలని ఆలోచన కూటమి ప్రభుత్వం నిర్మించుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు పాల్గొన్నారు