
పయనించే సూర్యుడు జూన్ 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల మండల వ్యవసాయ అధికారి శశిధర్ ఆధ్వర్యంలో స్థానిక చేజెర్ల వ్యవసాయ కార్యాలయంలో కృషి విజ్ఞాన కేంద్రం నెల్లూరు ఆధ్వర్యంలో విక్షిత్ క్రిషి సంకల్ప అభియాన్ ను పై రైతులకు అవగాహన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరి పరిశోధన కేంద్రం హైదరాబాద్ నుంచి వచ్చిన డా. ప్రసన్న రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పధకాల గురించి, వరి రకాల గురించి వివరించడం జరిగింది. జిల్లా ఉద్యాన అధికారి . సుబ్బా రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న ఉద్యాన పథకాల గురించి వివరించడం జరిగింది .అదేవిధంగా శాస్త్రవేత్త డా. సురేఖ దేవి భూసార పరీక్షలో గల ఆధునిక పద్ధతుల గురించి క్లుప్తంగా రైతులకు వివరించడం జరిగింది. రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకొని తదనుగుణంగా ఎరువుల యాజమాన్యం పాటించాలని తెలిపారు. వివిధ పంటలలో వేప నూనె పిచికారి ఆవశ్యకత గురించి రైతులకు తెలియజేయడం జరిగింది. కె.వి.కె శాస్త్రవేత్త డా. విజయ్ కుమార్ నాయక్ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి రైతులకు తెలియజేయడం జరిగింది. అలాగే వరి, మినుము, పెసరను ఆశించే వివిధ పురుగులు . తెగుళ్ల యాజమాన్యం గురించి వివరించడం జరిగింది. అదేవిధంగా విక్షిత్ క్రిషి సంకల్ప అభియాన్ లో భాగంగా పందుల పిచికారి డ్రోన్ గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో టి డి పి మండల అధ్యక్షుడు శిరాజుద్దీన్ .బి జె పి జిల్లా ఉపాధ్యక్షుడు బి. కృష్ణయ్య . నీటి సంఘం అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి రైతులు జివ్వుగుంట బాబు తదితరులు పాల్గొన్నారు