
పయనించే సూర్యుడు మే 03 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామం నందు మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్న గ్రామ దేవతల బొడ్రాయి, ధ్వజ స్థంభం, ఆంజనేయ స్వామి, ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్బంగా రెండవ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య దంపతులు లక్ష్మి, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, ఉమా ,పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఇల్లందు డి.ఎస్ పి.చంద్రభాను ,సి.ఐ లు బత్తుల సత్యనారాయణ, తాటిపాముల సురేష్ , ఎస్.ఐ రాజేందర్ గ్రామస్థులు పాల్గొన్నారు.
