
విఘ్నేశ్వరుడి దయవల్ల ప్రజలంతా చల్లగా ఉండాలి
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
శివభారత్ యూత్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు
పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్
( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
విగ్నేశ్వరుడి దయవల్ల ప్రజలకు ఉన్న విఘ్నాలు తొలగిపోయి ఏ పని ప్రారంభించినా విజయాలు పొందెలా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.బుధవారం షాద్ నగర్ పట్టణంలోని శివభారత్ యూత్ ఆధ్వర్యంలో పద్మావతి కాలనీ, ఎల్ ఎన్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ కార్యక్రమం అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఆధ్యాత్మికత ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మెన్ కొందూటి నరేందర్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్స్ నందకిశోర్,బండారు రమేష్, బెజుగాం రమేష్, వెంకట్ రెడ్డి, దండు వాసు, జర్నలిస్ట్ లక్కాకుల రమేష్ కుమార్, టాప్సన్ వెంకటేష్, మహేష్, పల్లె శ్రీనివాస్ రెడ్డి, హరిబాబు, రఘుమా రెడ్డి, చిన్న, నంద కిషోర్, అడ్వకేట్ నరేందర్,అందె ప్రభులింగం,మహేశ్వర్, బద్రప్పతదితరులు పాల్గొన్నారు.
