
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి పట్టణంలో ఉన్న విజన్ విద్యా సంస్థల యందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతూ విజన్ విద్యార్థులు వారి తల్లిదండ్రులకు వందన కార్యక్రమం నిర్వహించారు. తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తూ రాబోవు రోజుల్లో వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. విజన్ విద్యాసంస్థల కరస్పాండెంట్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కేవలం విద్యార్థుల యొక్క పనితీరును ఏ విధంగా ఉందో చర్చించడానికి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య ఒక సమన్వయ వేదికగా ఉపయోగించుకోవాలని అలాగే ప్రతి విద్యార్థి మీద ప్రతి తల్లిదండ్రులు కనీసం ఒక గంట సేపు సమయాన్ని కేటాయించి వారి బంగారు భవిష్యత్తుకు అడుగులు వేసే విధంగా చూడాలని అలాగే ఇంటిదగ్గర టీనేజ్ లో ఉన్న పిల్లల్లో ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని చరవాణి ఉపయోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరిగింది.విద్యార్థులు ప్రవర్తనలో కలిగే మార్పులను నిత్యం గమనిస్తూ ఉండాలని భవిష్యత్తుకు మంచిగా ఉపయోగపడే పౌరులను తీర్చిదిద్దడమే మనందరి లక్ష్యమని తెలపడం జరిగింది.. పాఠశాలలో ఎటువంటి సమస్యలున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకొని వచ్చి విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి పాటుపడాలని కోరడమైనది.అలాగే తల్లిదండ్రులు మరియు విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇంటిలో నలుగరు విద్యార్థులు ఉంటే 52,000, ముగ్గురు విద్యార్థులు ఉంటే 39వేల రూపాయలను అందజేశారని ఇలా ప్రతి ఇంటికి అందిందని హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.తల్లికి వందనం పురస్కారం గురించి యాజమాన్యం నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారా బహుమతులను ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు మరియు విజన్ ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది
