పయనించే సూర్యుడు న్యూస్ 10(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికిలోస్థానిక విజన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిథిగా యాడికి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈరన్న గారు పాల్గొని విజన్ విద్యార్థుల ముగ్గుల పోటీలను , బొమ్మల కొలువు మరియు కోలాటం కార్యక్రమాలను వీక్షించారు.తదుపరి విజన్ విద్యార్థుల చే బుర్రకథ, హరిదాసు, పిట్టలదొర , శోదమ్మ వంటి సంప్రదాయ గెటప్ లు , ఆయా పాత్రల లో విద్యార్థుల వేశ,భాషలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.సాంస్కృతిక శాస్త్రీయ నృత్యాలు సైతం అలరించాయి.తదుపరి ముగ్గుల పోటీలు, గాలి పటం తయారీ, రూ బిక్ కాంపిటేషన్ లలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథులు,తల్లిదండ్రులు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో తీరం పురం నీలకంఠ, ఆది నారాయణ, గుండా నారాయణ స్వామి, వెంకట స్వామి, విజన్ విద్యార్థుల తల్లిదండ్రులు,విజన్ ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
విజన్ లో ఘనంగా సంక్రాంతి సంబరాలు.
RELATED ARTICLES