
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి పట్టణంలో ఉన్న విజన్ విద్యాసంస్థల విద్యార్థులు గౌరవ తహసిల్దార్ ప్రతాప్ రెడ్డి గారిని అలాగే ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించి ఎమ్మార్వో ప్రతాప్ రెడ్డి గారితో ముఖాముఖి నిర్వహించడం జరిగింది…మా ఊరి పచ్చదనం కొరకు మీరు చేపట్టిన పనులకు స్ఫూర్తి ని పొంది మేము మిమ్మల్ని కలవడానికి వచ్చామని తెలుపుతూ విద్యార్థులు ప్రతాప్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు..ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు తహసిల్దార్ ప్రతాప్ రెడ్డి గారు విలువైన విషయాలను తెలియజేశారు. విద్యార్థులు మరియు తహ సిల్దారు గారి మధ్య ఆసక్తికరమైన సంభాషణ కొనసాగింది.ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా చాలా ఓపికతో తమ విలువైన సమయాన్ని కేటాయించి ప్రతాప్ రెడ్డి గారు విలువైన సమాచారాన్ని విద్యార్థులకు అందించడం జరిగింది . ల్యాండ్ రికార్డ్స్ అంటే ఏమిటి? మ్యుటేషన్ అంటే ఏమిటి? అలాగే మెజిస్ట్రేట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అంటే ఏమిటి వారి విధులు ఏంటి, ఎమ్మార్వో ఆఫీస్ లో ప్రజలకు సంబంధించిన ఏ ఏ పనులను చేస్తారు,ప్రజలకు ఏ విధంగా సేవలందిస్తారు అలాగే భూమి యొక్క సమస్యలు వాటి పరిష్కారాలు వాటి రికార్డులు మరియు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఎమ్మార్వో ఆఫీస్ కి మధ్య ఉన్న తేడాను అలాగే కోర్టు మరియు ఎమ్మార్వో ఆఫీస్ కి మధ్య ఉన్న సంబంధాలను విద్యార్థులకు చాలా వివరంగా తెలియజేశారు.. అలాగే తహసిల్దార్ ప్రతాప్ రెడ్డి ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు తను ఏ విధంగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించినది తెలియజేస్తూ మొదటగా జూనియర్ లెక్చరర్ గా పనిచేశానని తర్వాత సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేశానని తదుపరి తహసిల్దారుగా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని నాకు తహసిల్దారుగా బాధ్యతలు చేపట్టడం జరిగాక ప్రజలకు సేవ చేస్తూ ఎంతో సంతృప్తి ని పొందుతున్నానని తెలియజేశారు. అలాగే పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని భూమి మీద గ్లోబల్ వార్మింగ్ ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒకరి మీద ఉందని అందుకే తాను యాడికి పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటించి పర్యవేక్షణ చేస్తున్నానని తెలిపారు.ప్రస్తుత కాలంలో విద్యార్థులు చరవాణి కి చాలా దూరం గా ఉంటేనే భవిష్యత్ లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని కావున చరవాణి ని ఎక్కువగా వాడకుండా ఉంటామని విద్యార్థులతో ఆయన వాగ్దానం చేయించారు. అలాగే తమ వంతు బాధ్యతగా విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు మొక్కలను పెంచుతామని ఆయన చేతుల మీదుగా మొక్కలను నాటి మొక్కలను తీసుకున్నారు.విజన్ కరస్పాండంట్ విశ్వం మాట్లాడుతూ మీరు రోడ్ కిరువైపులా చెట్లను నాటించి వాటిని సంరక్షిస్తూ మాలో స్ఫూర్తి ని నింపారని తెలుపుతూ ప్రతాప్ రెడ్డి గారిని ఘనంగా సత్కరించారు.ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల్లో సామాజిక నైతిక విలువను పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని విజన్ ఉపాధ్యాయ బృందానికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది పాల్గొనడం జరిగింది.

