
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి పట్టణ కేంద్రంలో ఉన్న విజన్ స్కూల్ నందు డా” ఏ.పీ.జే.అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా విజన్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు కలసి ఆయన చిత్రపటానికి పూల మాల వేసి టెంకాయ సమర్పించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఆయన మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు అని వార్త పత్రికలను పంచుతూ చదువుకున్నారని, ఫిజిక్స్ లో పట్టా పొంది ఇస్రో లో శాస్త్రవేత్త గా పని చేస్తూ భారత రక్షణ విభాగంలో మిస్సైల్స్ ను కనుగొన్నారని, అలాగే గుండె కు అమర్చే స్టెంట్ ను కనుగొన్నారని, అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడే ట్యాబ్ ను కనుగొని ఎంతో మంది విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారని, అలాగే రాష్ట్రపతిగా పని చేశారని, ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత రత్న అవార్డును భారత ప్రభుత్వం అందజేసిందని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విజన్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
