వినగడప” గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజయవాడ – అను హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో, ఉచిత మెడికల్ క్యాంప్.
పయనించే సూర్యుడు జనవరి 26 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్తా విశ్లేషణ. మన మాజీ ఎంపీపీ శ్రీ శ్రీనుబాబు గారి సహకారంతో, వారి తండ్రిగారైన స్వర్గీయ శ్రీ కోటగిరి రంగస్వామి గారి మెమోరియల్, ఈ ఆదివారం అనగా, ది. 26-01-2025 నాడు, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గం.ల వరకు, యం.పి.యు.పి. స్కూల్, హరిజనవాడ నందు, ప్రముఖ గుండె సంబంధిత వైద్య నిపుణులు డాక్టర్ సాయి ప్రకాష్ గారు, మరియు ఎముకలు, కీళ్ళు, వెన్ను, నరముల శస్త్ర చికిత్స – కీళ్ళ మార్పిడి స్పెషలిస్ట్ – డాక్టర్ నందం రామారావు గారిచే “ఉచిత మెగా మెడికల్ క్యాంప్”.ఈ మెడికల్ క్యాంపు నందు ఈసీజీ, 2D ఎకో, ఎముకల బలహీనత ను గుర్తించేందుకు బోన్ మినరల్ డెన్సిటీ పరీక్షలతో పాటుగా కన్సల్టేషన్ ఉచితంగా చూడబడును. కావున “వినగడప” గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని మా మనవి.