
విజయ్ దేవరకొండ పై SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి
గిరిజన యువనాయక ఆకాష్ నాయక్
( పయనించే సూర్యుడు మే 03 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ )
గిరిజనుల ఆత్మగౌరాణి కించపరిచే వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు విజయ్ దేవరకొండపై చర్యలు తీసుకోవాలి. 26-04-2025 జరిగిన, రెట్రో’ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు గిరిజనుల మనోభావాలను త్రీవంగా దెబ్బ తీసే విధంగా వ్యాఖ్యలు చేయడంపై గిరిజనులు విజయ్ దేవరకొండ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 500 సంవత్సరాల క్రితం వారు బుద్ధి లేకుండా కొట్టుకున్నారు అనే వ్యాఖ్యాలతో పాటు ఉగ్రవాదులతో పోల్చేలా మాట్లాడటం అసహ్యకరమైనది, హేయమైనది. ఈ వ్యాఖ్యలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం శిక్షర్హమైనవి. ఈరోజు గిరిజన నాయకులు జిల్లెడు చౌదరిగూడ మండలం పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండపై చౌదరిగుడా మండల ఎస్ఐ విజయ్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ జరిపించి గిరిజనులకు క్షమాపణ అడగాలని డిమాండ్ చేస్తూ గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ పాదాల మీద పడి క్షమాపణ అడగాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు.