
పయనించే సూర్యుడు ఆగస్టు 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఇంజనీరింగ్ విద్య అభ్యస్తిస్తున్న విద్యార్థికి ఎస్ వి పి ప్రజావైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్టు అధినేత డాక్టర్ ప్రణీత్ ఆర్థిక సహాయం అందచేశారు. చేజర్ల మండలం చేజర్ల గ్రామానికి చెందిన వ రికూటి.శ్రీరామ్ నవీన్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విషయాన్ని ఆత్మకూరుకు చెందిన బిజెపి నాయకులు నున్నా సంతోష్ కుమార్ ద్వారా తెలుసుకుని విద్యార్థికి సోమవారం ఆసుపత్రిలో రూ.10వేలు అందచేశారు. భవిష్యత్తులో కూడా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు వెంకట సందీప్ . డాక్టర్ కుమార్, తోడేటి అశోక్ ,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు