
పయనించే సూర్యుడు ఆగస్టు 5( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల గవర్నమెంట్ జూనియర్ కళాశాల నందు సోమవారం గుడ్ టచ్ హ్యాండ్ బాధ టచ్ అనే అవేరేనెస్ ప్రోగ్రామ్ కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కె. సాలమ్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సంగం సీఐ కె. వేమారెడ్డి హాజరై విద్యార్థులు ను ఉదేసించి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండని ఆడపిల్లల జోలికి మగ పిల్లలు పోకూడదు వాళ్ళతో మిస్ భిహేవ్ చేయకూడదు అలా చేస్తే 25 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది ఒకవేళ అమ్మాయి అబ్బాయి ని తీసుకొని వెళ్లిన అబ్బాయి కే 25 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది అమ్మాయిలకు ఏ ఇబ్బంది అయినా 112 కు కాల్ చేయండి ఇది జనరల్ నెంబర్ 181 అమ్మాయిలకు మాత్రమే సంబంధిచినది ఎవ్వరు కూడా ప్రేమ అనే ఆకర్షణ కు లోను కాకూడదు మనము ప్రతి విద్యార్థి ప్రేమించాలి అంటే మన తల్లిదండ్రులను మన అన్న తమ్ముళ్లను మన అక్క చెల్లెమ్మలను అదే విధంగా మన చదివి చెప్పినటువంటి గురువులను ప్రేమించాలి అంతే తప్ప ఏ ఇతర వ్యక్తులను అబ్బాయిల జోలికి వెళ్ళకూడదు మనము కష్టపడి చదివి ఉన్నత స్థాయిని చేరుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు