
పయనించే సూర్యుడు మే 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఈరోజు ఏన్కూర్ లోని పాఠశాలల విద్యార్థుల దుస్తులు కుట్టే కేంద్రానికి వెళ్లి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ సత్యనారాయణ పరిశీలించడం జరిగిందని ఏనుకూరు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కే సైదయ్య తెలిపారు .ఏన్కూరు మండలానికి చెందిన దాదాపు అన్ని పాఠశాలల దుస్తులు ఈ కుట్టు కేంద్రంలోని కుట్టడం జరుగుతుందని, దాదాపు 90% పాఠశాలల దుస్తులు కుట్టడం జరిగింది. విద్యాశాఖ అధికారి కుట్టిన దుస్తులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు. సకాలంలో చక్కగా కుట్టినందుకు టైలర్ ను అభినందించారు. మిగిలిన 10 శాతం దుస్తులను కూడా కుట్టి ఈ నెల చివరి కల్లా పాఠశాలలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా దుస్తులు కుట్టడం పూర్తయిన ప్రాథమిక పాఠశాల ఏన్కూరు హరిజనవాడ ప్రాథమిక పాఠశాల, ఎస్టీ కాలనీ ప్రాథమిక పాఠశాల, నాచారం ఎస్టి కాలనీ ప్రాథమిక పాఠశాల ,గంగుల నాచారం ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వారి పాఠశాల లకు సంబంధించిన కుట్టిన దుస్తులను ప్రధానోపాధ్యాయులకు అందించారు. వీరి వెంట మండల విద్యాశాఖ అధికారి శ్రీమతి రహీం బి ,ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు ,మోతిలాల్ ,జయ, హథిరాం, గోపి ఉపాధ్యాయులు బి వెంకటేశ్వర్లు సిఆర్పి కృష్ణ ప్రసాద్ లు తదితరులు పాల్గొన్నారు.
