
ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కార్యదర్శి వడ్ల శ్రీకాంత్
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు
( పయనించే సూర్యుడు జూలై 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కుంటబడి స్కూల్ ని సందర్శించారు. అక్కడ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు. ఈ మధ్యకాలంలో వరుస ఫుడ్ పాయిజన్లు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. అలాగే ఫుడ్ పాయిజన్ ద్వారా చనిపోతున్న విద్యార్థులందరికీ ప్రభుత్వం న్యాయం చేయాలని వారు కోరారు. తెలంగాణలో ఇటీవలి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు ప్రజలలో ఆందోళన కలిగించాయి. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మరియు ఆహార భద్రతా ప్రమాణాలను సరిగా అమలు చేయకపోవడం ఈ సమస్యకు ప్రధాన కారణాలు ఫుడ్ పాయిజనింగ్ సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను విశ్లేషిస్తూ, వాటిని నివారించడానికి అవసరమైన చర్యలను తీసుకోవాలి. తెలంగాణలో, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు తరచూ నమోదవుతున్నాయి. నిర్మల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 10 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారు. అసమర్థంగా వండిన ఆహారం, సరైన అవగాహన లేని సిబ్బంది ఈ ఘటనలకు కారణమని తెలుస్తోంది. అదేవిధంగా, నాగర్‌కర్నూల్‌లో జరిగిన ఒక ఘటనలో 150 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు, కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడం సిగ్గుచేటు.. విద్యార్థులు వరుస పాయిజన్లతో చనిపోతా ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో వివరణ ఇవ్వాలి అలాగే విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించి గురుకులాలలో పర్యటించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలి అక్కడున్నటువంటి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలి అని ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ టౌన్ ఉపాధ్యక్షులు ఆదిల్ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు ఖయ్యూం, ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు..
