
బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ జమ్మికుంట..
పయనించే సూర్యడు // మార్చ్ // 22 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ప్రజా సమస్యల కోసం ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారని బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025- 26 సంవత్సరం గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్య రంగానికి తగిన బడ్జెట్ కేటాయించకపోవడంలో నిర్లక్ష్యం వ్యవహరించి విద్యా వ్యవస్థకు అన్యాయం జరిగిందని, శనివారం రోజున విద్యా సంఘాల నాయకులతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉన్నందున శనివారం ఉదయకాలం పోలీసులు వచ్చి తన స్వగృహం అయినటువంటి ఆబాది జమ్మికుంటలో అక్రమంగా అరెస్టు చేయడం జరిగినది, అని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యారంగానికి మంత్రి కూడా లేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అని రాష్ట్రంలో గురుకులాలో ఆహారంలో నాణ్యత లోపించి, సరియైన సదుపాయాలు లేక జరుగుతున్న విద్యార్థుల మరణాలకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కారణమని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో రకాలైన ఇబ్బందులు ప్రజా ప్రభుత్వాన్ని చెప్పుకోవడమే తప్ప పేద ప్రజలకు కనీసం న్యాయం కూడా జరగకపోవడం ఇలా చెప్పకుండా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలలో కేవలం సంవత్సరంనర లోనే తీవ్ర వ్యతిరేకత రావడం జీర్ణించుకోలేక తెలంగాణ ప్రజల పైన సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని,అన్నారు. తెలంగాణ ప్రజలు గత కెసిఆర్ ప్రభుత్వంలో రైతులు గాని విద్యార్థులు గాని ప్రతి ఒక్కరు బాగుపడడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రస్తుతం బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితేనే మళ్లీ పేద ప్రజల జీవితాలు బాగుపడతాయని ఆయన అన్నారు. ఇలా ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేసి మా ఉద్యమాన్ని ఆపలేరని, తెలంగాణ ప్రజలు అంటేనే ఉద్యమకారులని ఉద్యమకారుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గకరమని కొమ్ము నరేష్ తెలిపారు.