
శ్రీమతి విద్యాచందన జిల్లా అదనపు కలెక్టర్ మరియు డి ఆర్ డి ఓ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పయనించే సూర్యుడు మే 21 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ స్టిచ్చింగ్ ను పూర్తి చేసి పాఠశాల ప్రారంభం నాటికి విద్యార్థులకు అందజేసే విధంగా ప్రణాళిక బద్ధంగా పనిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మరియు డిఆర్డిఓ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీమతి విద్యా చందన అధికారులను ఆదేశించారు ఈ రోజు టేకులపల్లి మండలంలో పర్యటించిన ఆమె జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీలను ఇంకుడు గుంతలను మరియు నీటి గుంతలను పరిశీలించిన తరువాత ఆంజనేయపాలెం స్టిచ్చింగ్ సెంటర్స్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల వారీగా ఏర్పాటు చేసిన కొలతల రిజిస్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థి వారిగా కొలతలు సేకరించార లేదా అని సెంటర్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు తరగతి వారీగా రిజిస్టర్లో నమోదు చేసిన విద్యార్థుల కొలతలను పరిశీలించారు.కుట్టిన దుస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి యూనిఫామ్ మీద విద్యార్థి పేరు తప్పనిసరిగా ట్యాగ్ వేసి రాయాలని సూచించారు షర్ట్ క్లాత్ ను వెంటనే విద్యాశాఖ అధికారుల తో సమన్వయం చేసుకుని వారి నుండి క్లాత్ ను సేకరించి త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు
జూన్ రెండవ తారీకు వరకు అన్ని పాఠశాలలకు యూనిఫామ్ అందజేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి లో భాగంగా మహిళలకు విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతను అప్పగించటం ద్వారా మహిళలకు గౌరవం పెరిగిందని ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని స్థానిక టైలర్లకు తెలియజేశారుఈ కార్యక్రమంలో ఏపిఎం రవికుమార్ సిసి నాగమణి నాగేశ్వరరావు శిరీష వీరలక్ష్మి దుర్గ పాల్గొన్నారు.