
పయనించే సూర్యడు //ఫిబ్రవరి 12//హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ //కుమార్ యాదవ్.. తెలంగాణ రాష్ట్రము లో విద్యాశాఖ మంత్రి నీ నియమించాలని పి డి ఎస్ యు ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా పి డి ఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యులు అంగిడి కుమార్ మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి రెండు సంవత్సరాల కాలం గడుస్తున్న నేటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించకుండా కాలయాపన చేయడం రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేది అన్నట్టు ఉన్నది వ్యవహారం విద్యాశాఖ మంత్రి లేనందువల్ల తెలంగాణ రాష్ట్రంలో అత్యా రంగ పరిస్థితులు పూర్తిగా నాశనం అయితున్నారు.విద్యారంగాని అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ విద్యారంగాని పూర్తిగా గాలికి వదిలేసింది అని అన్నారు.అట్లాగే పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయకుండా కాలయాపన చేయడం వల్ల విద్యార్థులు కళాశాల యాజమాన్యాల ద్వారా అనేక రకాల ఇబ్బందులు, ఎదురుకుంటున్నారు,అని తెలిపారు.వెంటనే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని అన్నారు.అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని,ఆరోకోరా నిధులు కేటాయించడం వల్ల విద్యారంగం అభివృద్ధి కి నోచుకోవడం లేదు అని అన్నారు. జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు, జిల్లా కార్యదర్శి ముల్కల మారుతి , నాయకులు ప్రవీణ్ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.