
//పయనించే సూర్యుడు// జులై//24
నర్వ మండల కేంద్రము & పెద్ద కడ్మూర్ జెడ్పీ హై స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ ప్రతిభ,SVM, గీత భారతీ స్కూల్స్ బంద్ చేయటం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కే యం మహేందర్ పిడిఎస్ యు నాయకులు రామక్రిష్ణ లు మాట్లాడుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
9 వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ , స్కాలర్షిప్ 8000 కోట్ల రూపాయలు , మెస్ కాస్మొటిక్ చార్జీలు ప్రభుత్వం విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్ , ఎంఈఓ, డిఈఓ పోస్ట్ లను భర్తీ చేయాలని అలాగే విద్యాశాఖకు మంత్రినీ నియమించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని, అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి నిధులు ఇవ్వాలని, పెండింగ్ మిస్ కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని, నడుస్తున్న వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించాలని, గురుకులాలలో అశాస్త్రీయంగా తీసుకువచ్చిన సమయపాలన మార్చాలని , బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు, ఎయిడేడ్ పాఠశాలకు పెండింగ్ నిధులు ఇవ్వాలనీ, విద్యార్థులకు ఆర్టీసీలలో ఉచిత బస్సు పాసులు ఇవ్వాలనీ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలనీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చట్టాన్ని తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలనీ అలాగే నర్వ మండలంలో ప్రభుత్వ జనరల్ జూనియర్ కళాశాలను తొందరగా ఏర్పాటు చేయాలని ఎన్నోసార్లు గత ప్రభుత్వాన్ని వేడుకున్న ఆ పని నెరవేరకుండా చేశాడు కేసీఆర్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా వాకిడి శ్రీహరి మక్తల్ నియోజకవర్గం మొట్టమొదటి బీసీ బిడ్డవు కనుక ఇచ్చిన మాట ఎలక్షన్ లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేనియెడల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చలో కలెక్టరేట్ ముట్టడిగాని చలో కలెక్టరేట్ ముట్టడిగాని గ్రామాలలో ఉన్న మీ కాంగ్రెస్ కార్యకర్తల ఇళ్ళను కూడా ముట్టడించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్, రాము, శివా, అజయ్, పిడిఎస్ యు నాయకులు పోలన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..

