
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా ఆర్మూర్
.టిఫిజేపి నాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరీ
విధ్య వైద్యంను ప్రజలకు అందించడం ప్రభుత్వాల సామజిక బాధ్యత
ఏఐకేయూఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి. ప్రభాకర్
విధ్య వైద్యం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, *టిఫిజేపినాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరీ అన్నారు.
ఏ.ఐ.యూ.కే.ఎస్, ఏ.ఐ.పీ.కే.ఎం.ఎస్, టీ.యూ.సి.ఐ, పి.వై.ఎల్, పీ.వో.డబ్ల్యూ, పి.డి.ఎస్.యూ తదితర విప్లవ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో “విద్య, వైద్యం ప్రజలకు అందించడం ప్రభుత్వాల బాధ్యత” అన్న అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంకు ముఖ్యఅతిధిగా హాజరైన టిఫిజేపినాయకులు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరీ మాట్లాడుతు: విద్య, వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు అందుబాటులోకి తేవలసిన అవసరం ఉందన్నారు. ప్రజలకు వైద్యం అందక అప్పుల పాలైతున్నారు అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూటీవో ప్రకారం ప్రజల ఆరోగ్యం పట్ల పాటించాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నాయ్ అన్నారు. విద్యవైద్యం కోసం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నారు.విధ్య వైద్యంను ప్రజలకు అందించడం ప్రభుత్వాల సామజిక బాధ్యత ఏఐకేయూఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి. ప్రభాకర్ మాట్లాడుతు ప్రభుత్వాలు విద్యా వైద్యం వదిలేసి పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్లు తమ, తమ బడ్జెట్లల్లో నిధులు పెంచాల్సింది పోయి తగ్గిస్తు పోతుంది అన్నారు. గ్రామీణ స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలలో ఆధ్వహ్నంలో ఉండడాన్ని బట్టి చూస్తేనే అర్ధం అవుతుంది అన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యం అందేలాగా ఆందోళనలకు పూనుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఏఐయుకేఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్ అధ్యక్షత వహించగా ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రామకృష్ణ, ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, టీయూసిఐ కార్యదర్శి ఎం. ముత్తెన్న, పీవోడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి. గోదావరి, పిడియస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. అనిల్ కుమార్, రాజకీయ పార్టీలు, దళిత ప్రజాసంఘాల జేఏసి జిల్లా కన్వీనర్ సావెల్. గంగాధర్, ప్రశాంగించగా విప్లవ ప్రజాసంఘాల జిల్లా నాయకులు కే. రాజేశ్వర్, ఏ. ప్రకాష్, వి.సత్తేవ్వ, బి. బాబన్న, ఆర్. దామోదర్, చెప్పాలా రాజేశ్వర్ నడ్పినర్సయ్య, జి. కిషన్, ఎం. అనిస్, ఆకుల. గంగారాం, యూ. రాజన్న, మల్కి. లింబాద్రి, జి. అరవింద్, బి. రవి, ఏ. మమత, జి. పద్మ, జి. సాయరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
