
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 30(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్రంలోని కోటవీధిలో జెండాకట్ట వద్ద ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద నిర్వహించిన లడ్డూ వేలం పాటలో 24,000 రూపాయలకు టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న చెక్ పోస్ట్ రామయ్య దక్కించుకున్నాడు. అలాగే వినాయకుడి బొడ్డు బిళ్ళను కోట వీధికి చెందిన మీసాల కల్లమడి కంబగిరి స్వామి గారు 6,100 రూపాయలకు దక్కించుకున్నారు వేలంపాట దక్కించుకున్న వారికి కోటవీధి వినాయక ఉత్సవ కమిటీ వారు శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు.
