
పయనించే సూర్యుడు మే 30 ( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మేకపాటి కార్యాలయ ఉద్యోగి నల్లిపోగు లాజర్. జోస్ మేరీల వివాహము గురువారం ఉదయగిరిలో జరగడంతో ఆత్మకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. లాజర్ తమ వద్ద ఎన్నో సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాడని, అతని వివాహ జీవితం ఎంతో ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా నూతన దంపతులకు ఆశీర్వాదాలు తెలిపి కుటుంబ సభ్యులకు శుభాభినందనలు తెలియజేశారు ఆయన వెంట ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు ఉన్నారు