
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 18:- రిపోర్టర్( కే శివకృష్ణ )
విశ్రాంత ఉద్యోగుల నిరసన ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు బాపట్ల తాలూకా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలపై ప్రధానమైన డిమాండ్లు :ది. 1-7-2018,1-1-2019 నాటి డిఎ బకాయిలను చెల్లించాలని,1-7-2023 తేదీతో పి.ఆర్.సి కమిషన్ వేయాలని, మధ్యంతర భృతి మంజూరు చేయాలని, విశ్రాంత ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్, 70 సంవత్సరముల వారికి 10 శాతం,75 సంవత్సరముల వారికి 15 శాతం,80 సంవత్సరముల వారికి20 శాతంగా పునరుద్ధరణ చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ కార్డులతో ఉచిత వైద్యం అందించాలని, తాహసిల్దార్ మరియు జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సోమవారము అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధాప్యద శలో నున్న మీకు మీ యొక్క డిమాండ్లు నెరవేర్చవలసినదిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించగల నని తెలిపియున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో చీరాల బాపట్ల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారి వై.వి నరసింహారావు, పీవీ ప్రసాద్, సుబ్బారావు, రామకృష్ణ, బాపట్ల జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కోడూరి ఏకాంబరీశ్వర బాబు, జనరల్ సెక్రెటరీ ఎన్. సిద్దయ్య, కోశాధికారి ఎం.వి బ్రహ్మం, ఈ నిరసన కార్యక్రమంలో చీరాల బాపట్ల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు