
// పవనుంచే సూర్యుడు// న్యూస్ ఆగస్టు17//
స్థానిక మక్తల్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం మరియు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ నారాయణపేట జిల్లా గౌరవ సలహా సభ్యులు వి. భీమ్ రెడ్డి మాట్లాడుతూ విశ్వజన సంక్షేమమే విశ్వహిందూ పరిషత్ లక్ష్యం అని, హైందవ చైతన్యమే భారత సంక్షేమము దిశగా విశ్వహిందూ పరిషత్ పనిచేస్తుందని అన్నారు.1964 వ సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజుననే ముంబైలోని సాందీపని ఆవాసంలో పరమ పూజనీయ మాధవరావు సదాశివరావు గొల్వల్కర్ విశ్వహిందూ పరిషత్ ను స్థాపించారని సూచించారు. ప్రతి హిందువు హిందూ ధర్మ పరిరక్షణకు కంకణబద్ధలై హైందవ ధర్మాన్ని,సంస్కృతి సాంప్రదాయాలను, కాపాడాలని సూచించారు. భగవాన్ శ్రీకృష్ణుడు జీవితం సర్వ మానవాళికి ఆదర్శనీయమని, పూజనీయమని,ధర్మ పరిరక్షణకై శ్రీకృష్ణుడు చూపిన మార్గదర్శనములో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని సూచించారు. అనంతరం విశ్వహిందూ పరిషత్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మక్తల్ పట్టణంలోని నారాయణపేట రోడ్డు తిలక్ మార్గ్ నందు, అంబేద్కర్ చౌరస్తాయందు నేతాజీ మార్క్ చౌరస్తాలో ఓంకార కాషాయ ధ్వజాలను ఎగుర వేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సహా కాయదర్శి భాస్కర్ రెడ్డి, ప్రఖండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, వాకిటి భీమన్న, మల్లికార్జున రావు, తిరుపతి శ్రీను, బజరంగ్ దళ్ నారాయణపేట జిల్లా సహా సంయోజక్ పసుపుల భీమేష్, ప్రఖండ సంయోజక్ రాహుల్, సాహ సంయోజక్ శివ, పరశురాం, నర్సింహా రెడ్డి, కృష్ణ మూర్తి,బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
