
 
రైచూర్ రోడ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్ లో జయంతి కార్యక్రమలు
{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 31} మక్తల్
సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31న జన్మించారు, ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు రాజనీతిజ్ఞుడు. ఆయన భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి మరియు హోం మంత్రిగా పనిచేశారు,స్వాతంత్ర్యానంతరం, 500కు పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు, దీనికి గాను ఆయనను “భారతదేశ ఉక్కు మనిషి” అని పిలుస్తారు.పెద్ద చెరువు దండు క్రాస్ నుండి చందపూర్ వరకు రోడ్లు ఇరువైపులా సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్ గా నామకరణమైనందున ఏ చౌరస్తాలో కార్యక్రమం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్గ్ రాస్తూ చౌరస్తా పేరు రాసి వారి యొక్క కార్యక్రమం నిర్వహించవలసిందిగా విన్నపం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఏబీవీపీ, బీజేవైఎం,పెద్దలు&యువకులు తదితరులు పాల్గొన్నారు

 
				