
//పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 14//మక్తల్
స్థానిక మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, భజరంగ దళ్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించి ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా గౌరవ సలహా సభ్యులు వి. భీమ్ రెడ్డి, ప్రఖండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు వాకిటి భీమన్న, పట్టణ కార్యదర్శి మల్లికార్జునరావు, భజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ పసుపుల భీమేష్, మండల సంయోజక్ రామాంజనేయులు, పరశురాం, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
