
రుద్రూర్, జూలై 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): నాగుల పంచమిని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని జేఎన్సీ కాలనీ, గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర, అంగడి బజార్ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద, వివిధ గ్రామాలలో ఆవు పాలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం నాగుల పంచమి రోజున విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో దాదాపు 120 లీటర్ల ఆవు పాలను పూజ కొరకు ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతి మురళి, గుండూరు ప్రశాంత్ గౌడ్, హిందు సంఘాల యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు