
//పయనించే సూర్యుడు// ఆగస్టు 1//మక్తల్
నారాయణపేట పట్టణంలో గణేష్ విగ్రహాల ను తయారు చేస్తున్న చోటే కొందరు హిందూధర్మ విద్వేషులు ధ్వంసం చేయడం జరిగింది. గణేష్ ఉత్సవాలు సమీపిస్తున్న సమయంలో కల్లోలాలు సృష్టించడం కోసం హిందూ ధర్మంపై ద్వేషంతో గణేష్ విగ్రహాలపై రాళ్లు విసరడం, విగ్రహాలను ధ్వంసం చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. గత సంవత్సరం మక్తల్ లో ఈసారి నారాయణపేటలో. కావున దయచేసి అట్టి విద్రోహులను తక్షణమే గుర్తించి శిక్షించగలరని, మళ్లీ ఇలాంటివి జరిగితే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని మనవి. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షులు కే సత్యనారాయణ గౌడ్, పట్టణ అధ్యక్షులు. తోక హనుమంతు,కార్యదర్శి మల్లికార్జున్, బజరంగ్ దళ్ నారాయణపేట జిల్లా సాహ సంయోజక్ భీమేష్, ప్రఖండ సంయోజాక్ రాహుల్, మూర్తి, రామాంజనేయులు, నాగరాజు, రాము, అక్షయ్, శివ, పరశురాం, తదితరులు పాల్గొన్నారు