
జాడి ఈశ్వర్ నేతకాని.
పయనించే సూర్యుడు:జులై 01:ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
నూగూరు వెంకటాపురం; ములుగు జిల్లా నూగూరువెంకటాపురం మండలం ని అన్ని రంగాలలో అభివృద్ధి జరగాలంటే, త్వరలో ఏర్పాటు చేయబోయే నూతన అసెంబ్లీ నియోజకవర్గాల ఏర్పాటులో భాగంగా నూగూరు వెంకటాపురం మండల కేంద్రం ను అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం గా ఏర్పాటు చేయాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాడి ఈశ్వర్ నేతకాని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇట్టి నియోజకవర్గ ఏర్పాటు కొరకు వెంకటాపురం లో ఉన్న ప్రధాన అధికార, ప్రతిపక్ష పార్టీలు తీర్మానం చేసి, నూగూరు వెంకటాపురం మండల కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలని ఏక ముక్తా కంఠంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తమ గళం వినిపించాలని ఈ సందర్భంగా ఆయా పార్టీలను కోరారు. వెంకటాపురం మండలం ఇటు భద్రాచలం, అటు ములుగు నియోజక వర్గాలకు మధ్యలో ఉండి, అభివృద్ధికి నోచుకోవడం లేదని, అరకొర నిధులతో వెంకటాపురం మండలం అభివృద్ధికి అందని దూరంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం మండల కేంద్రం లో సెంట్రల్ లైట్ రోడ్ ఏర్పాటు చేయాలని, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని, అంబేద్కర్, కొమరం భీమ్ కమ్యూనిటీ భవనాలు నిర్మించాలని, దళిత గిరిజన యువత ఉపాధి కొరకు ఏదైనా భారీ పరిశ్రమ ఏర్పాటు చేయాలని, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని, వెంకటాపురం మండలంలోని ప్రతి గ్రామంలో పూర్తి స్థాయి సీసీ రోడ్లు వేయాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్సరే, స్కానింగ్, పూర్తి స్థాయి బ్లడ్ టెస్ట్ లు చేసేలా ఏర్పాటు చేయాలని, వెంకటాపురం మండలంను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు.