పయనించే సూర్యుడు వెంకటాపురం మండల రీపోటర్ బట్టా శ్రీనివాసరావు Date:23-01-2024 వెంకటాపురం సిఐ బండారి కుమార్ చేతుల మీదుగా వీల్ చైర్ పంపిణీ ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన శ్యామల శ్రీకాంత్ కొన్ని సంవత్సరాల క్రితం ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోయి రెండు కాళ్లు చచ్చు పడిపోవడం జరిగింది. తనకున్న వీల్ చైర్ కరాబవ్వడంతో సిఐ గారి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి బచ్చు రవిచంద్రను సంప్రదించగా వెంటనే శ్యామల శ్రీకాంత్ కొరకు వీల్ చైర్ తప్పించి వెంకటాపురం మండల పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ చేతుల మీదుగా శ్యామల శ్రీకాంత్ కు వీల్ చైర్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బచ్చు రవిచందర్ చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ వనపర్తి రవీందర్ ఏఎస్ఐ రామచంద్రు కానిస్టేబుల్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
వెంకటాపురం సిఐ బండారి కుమార్ చేతుల మీదుగా వీల్ చైర్ పంపిణీ
RELATED ARTICLES