
పైనుంచి సూర్యుడు రిపోర్టర్ జలి నరేష్ మే 7 చింతూరు డివిజన్ ఇంచార్జ్ వి.ఆర్ పురం బీసీ
కాలనీ నుండి ఎంపీడీవో కార్యాలయం రేకపల్లి వరకు వెళ్లే రోడ్డును తారు రోడ్డు నిర్మాణం పేరుతో వెట్ మిక్స్ వేసి తారు వేయకుండా వదిలేయడం జరిగింది. అట్టి విషయంపై స్థానిక ఎంపీపీ కారం లక్ష్మి ఫిర్యాదు మేరకు చింతూరు ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్ ఐఏఎస్ గారు స్పందించి రోడ్డును తనిఖీ చేస్తున్నటువంటి దృశ్యం ఈ కార్యక్రమంలో సి పి యం పార్టీ మండల కార్యదర్శి పులి సంతోష్ కుమార్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సోయం చినబాబు, కారం సుందరయ్య, పొడియం శ్రీరామ్మూర్తి,పంకు సత్తిబాబు వడ్లది రమేష్ తదితరులు పాల్గొన్నారు.