పయనించే సూర్యుడు జనవరి 10హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి
వెన్నంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలలో భాగంగా జడ్పీహెచ్ఎస్ వెన్నంపల్లి పాఠశాలలో రంగవల్లుల పోటీలను నిర్వహించడం జరిగింది .ఈ పోటీలలో విద్యార్థులు అధ్యంతం ఉత్సాహంగా పాల్గొని తమ యొక్క ఆలోచన విధానాన్ని రంగవల్లులలో ప్రతిబింబించారు. సామాజిక బాధ్యత పర్యావరణ పరిరక్షణ పరిజ్ఞానము మొదలైన అంశాలలో వారు రంగవల్లులను వేసి తమ ఆలోచన విధానాన్ని తమ బాధ్యతను తమ యొక్క విశాల దృక్పథాన్ని ప్రతిబింబించారని ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఇదే రకంగా విద్యార్థులు మిగతా కార్యక్రమాలలో కూడా ఇదే రకమైన ఉత్సాహంతో పాల్గొనాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తీరైన రంగులతో వేసిన రంగవల్లులు మన సంస్కృతితో పాటు సామాజిక పర్యావరణ రహిత పర్యావరణ సహిత విషయాలను వివరించాలని ఉపాధ్యాయుల అభిప్రాయపడ్డారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం కే శ్రీనివాస్ రెడ్డి, టీ జై గోపాల్ సింగ్ , వి. ప్రవీణ్ కుమార్, కే సత్యనారాయణ రెడ్డి, కుమార్ ,సత్య , జయప్రద ,పద్మ ,జ్యోతి, నలిని, మరియు సిఆర్పి రమేష్ పాల్గొన్నారు.