Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్వేసవికాలం సమతుల ఆహారమే తీసుకోవాలి

వేసవికాలం సమతుల ఆహారమే తీసుకోవాలి

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 7 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

అసలే వేసవి కాలం రోజురోజుకూ ఎండలు ముదురుతున్నారు. రాబోయే రోజుల్లో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు సైతం పెరుగుతాయి. అందువల్ల ఈ కాలంలో మనం తీసుకునే ఆహారం అత్యంత కీలకం. అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. చెమట అధికరగా ఉత్పన్నమవుతుంది. శరీరంలోని లవణాలు తగ్గిపోతాయి. ఫలితంగా వడదెబ్బ భారినపడే అవకాశం ఉంది వేసవి తాపాన్ని తట్టుకోలేక చాలామంది చల్లని పదార్థాలు తీసుకుంటూ ఉంటారు ఇది ఇంకో చేటు కల్గిస్తుంది వేసవిలో చర్మ వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఎదుర్కొనాలంటే మన రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. అందుకు ప్రతిఒక్కరూ సమతుల ఆహారం తీసుకోవాలి వేసవికాలం అంటేనే చాలామందికి భయం వేస్తుంది వేడిగాలులు ఉక్కపోత అధిక చెమటతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటాం కాలాన్ని మార్చటం మన చేతుల్లో లేదు మన జీవన శైలిలో భాగంగా మన నడక నడత ఆహారం వ్యాయామం నిద్ర అన్నింటినీ కాలానుగుణంగా మార్చుకోవాలి రక్షిత మంచినీరు మంచి పౌష్టికాహారం తీసుకోవటం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు మన శరీరం కాలానుగుణంగా వాతావరణానికి అలవాటు పడేలా ఉండాలి ఈ క్రింది వాటిని పాటిస్తే ఆరోగ్య సంరక్షణ పదిలం రక్షిత మంచినీరు మన శరీరంలో 70 శాతం నీరు ఉంటుంది. ఇది అధిక ఉష్ణోగ్రతను తగ్గించటంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ నిల్వలను కాపాడుకుంటే మన ఆరోగ్యానికి తిరుగుండదు ఈకాలంలో తరచూ నీటిని ఎక్కువగా తాగుతుండాలి అప్పుడు శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకూడదు నిర్లక్ష్యం చేస్తే వడదెబ్బకు గురౌతారు ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లే ప్రమాదం ఉంటుంది. మరీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు
తాజాపండ్లు నీరు పోషకాలశాతం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి తాజాపండ్లు కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి పుచ్చకాయ కర్బూజ బొప్పాయి జామ అరటిపండు వాటర్‌ యాపిల్‌ ద్రాక్ష మొదలైనవి ఎక్కువగా తీసుకోవాలి నిమ్మ నారింజ బత్తాయి కమలా పండ్ల రసాలు శ్రేయస్కరం ప్రకృతిపరంగా లభించే పండ్లు పండ్ల రసాలు అన్ని విధాలుగా మంచిది. రాగులు జొన్నలు మొదలైన చిరు ధాన్యాలు తీసుకోవటం కూడా మంచిదే ఇవి శక్తిని ఇస్తాయి ఎండల్లో నిస్సత్తువ ఉండదు ద్రవపదార్థాలు వేసవిలో పెరుగు తీసుకోవటం వల్ల శరీరం చల్లబడుతుంది జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగుపడుతుంది పుదీనాతో కలిపి తీసుకుంటే ఎక్కువ లాభాలుంటాయి. ఉల్లిపాయలు కూడా శరీరాన్ని చల్లబరుస్తాయి ఉల్లిని నిత్యం ఆహారంలో భాగంగా తీసుకుంటే వడదెబ్బ తగలదు. మజ్జిగ శరీరంలోని జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో ప్రోబయెటిక్స్‌ అధికంగా ఉంటాయి. కొబ్బరినీళ్లు ఈకాలంలో తరచూ తీసుకోవాలి వీటిలో ఉండే ఖనిజ లవణాలు ఎక్కువ శక్తిని ఇస్తాయి వడగాల్పులు వేడిగాలుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి పటిష్టమైన రోగ నిరోధక వ్యవస్థ వేసవిలో బలమైన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఖనిజలవణాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి ఆహారంలో పాలు గుడ్లు టమోటా నారింజ పసుపు రంగు కూరగాయలు చిలకడదుంప, చేపలు మొదలైనవి తీసుకోవాలి ఇవేకాకుండా బ్లాక్‌ బెర్రీ బ్లూ బెర్రీస్‌లు తినటం చాలామంచిది వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉంటాయి ఇంకాను ఆహారంలో సొరకాయ దోసకాయ బీరకాయ పొట్లకాయ మొదలైన కూరగాయలు వినియోగించటం ఎంతో మంచిది. ఈ విధమైన ఆహారాన్ని ఎక్కువగా సలాడ్‌ రూపంలో తీసుకోవటం మంచిది పోషకాల ఆహారం శ్రేయస్కరం విటమిన్‌ ఎ ఇది కంటి చూపును రోగ నిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది కాప్సికం పాలు గుడ్లు టమాటా ముదురు ఆకుపచ్చ కూరగాయలు, నారింజ పసుపు కూరగాయలు క్యారెట్‌ చిలగడదుంప వంటివి సమృద్ధిగా తీసుకోవాలి విటమిన్‌ సి ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది ఇది ఇమ్యూనిటీని బూస్ట్‌ చేస్తుంది ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది ఫ్రీ రాడికల్స్‌ను న్యూట్రల్‌ చేయడానికి సహాయపడుతుంది ఇది చర్మాన్ని రక్షిస్తుంది ఉసిరి మామిడి నారింజ కివి నిమ్మకాలు గ్రేప్‌ఫ్రూట్‌ టమోటాలు ద్రాక్ష బంగాళదుంపలు స్ట్రాబెర్రీలు బ్రోకలీ బొప్పాయిలో విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది విటమిన్‌ ఇ పొద్దుతిరుగుడు విత్తనాలు బాదం వేరుశెనగ పీనట్‌ బటర్‌ గుమ్మడికాయ గింజలు, క్యాప్సికం బీట్‌రూట్‌, ఆకుకూరల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఇది శరీరంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. టాక్సిన్స్‌, వ్యర్థాలను క్లియర్‌ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌తో సమర్థవంతంగా పోరాడుతుంది. శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. విటమిన్‌ డి వేసవిలో కండరాల నొప్పులు జీర్ణ సమస్యలను నివారించటానికి శరీరంలో తగినంత విటమిన్‌ డి అవసరం. ఉదయం పూట కొద్దిసేపు సూర్యరశ్మిలో ఉండటంతోపాటు పెరుగు పాలు ఓట్స్‌ పుట్టగొడుగులు గుడ్డు పచ్చసొన వంటివి తీసుకోవాలి ఎలక్ట్రోలైట్లు వేసవిలో చెమట ద్వారా అధిక మొత్తంలో పొటాషియం బయటకు వెళ్తుంది. ఎలక్ట్రోలైట్లు ఫ్లూయిడ్‌ సమతుల్యతను నియంత్రించటంలో కీలకపాత్ర పోషిస్తాయి ఆరోగ్యకరమైన కరడరాలు నరాల పనితీరును మెరుగుపరుస్తుంది అరటిపండ్లు బీన్స్‌ పప్పులు మామిడి ద్రాక్ష, నేరేడు పండు, ఆకుకూరలు తీసుకోవాలి. మెగ్నీషియం చెమటలతో శరీర ఎలక్ట్రోలైట్‌ అసమతుల్యతకు దారితీస్తుంది. డార్క్‌ చాక్లెట్‌ నట్స్‌ సోయా విత్తనాలు, తృణధాన్యాలు అరటిపండు, ముదురు ఆకుకూరలు తినాలి. ఆహారానికి తోడు ఈ క్రింది జాగ్రత్తలు కూడా పాటించాలి ఎండల్లో అవసరమైతే తప్ప తిరగకుండా ఉండటం మేలు
తలపై రక్షణకు గొడుగు లేదా టోపీ పెట్టుకోవాలి చేనేత కాటన్‌ దుస్తులు ధరించటం మేలు రక్షిత మంచినీటినే తాగాలి సరిపడా నిద్ర పోవాలి
ప్రతిరోజూ వ్యాయామం చేయాలి ఇవి చేయొద్దు శీతల పానీయాలను తీసుకోవద్దు స్ట్రీట్‌ఫుడ్‌ తినొద్దు నూనె వేప్పుళ్లులా ఉండే ఆహారం తగ్గించటం మేలు
కాఫీలు టీలు తగ్గించేయాలి సాల్టెడ్‌ఫుడ్స్‌ నిల్వ ఆహారం తినొద్దు మసాలాలు ఎక్కువ ఉండే ఆహారం వద్దు మాంసాహారం తగ్గించటం ఉత్తమం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments