
వైన్స్ షాపులో రికార్డులను పరిశీలిస్తున్న ఎక్సైజ్ సీఐ భాస్కర్ రావు..
రుద్రూర్, మార్చ్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
: రుద్రూర్ మండల కేంద్రంలోని వైన్స్ షాపులో గురువారం ఎక్సైజ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్సైజ్ సీఐ భాస్కర్ రావు వైన్స్ షాపులో పలు రికార్డులను పరిశీలించారు. స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు.