
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కె గంగాధర్
రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా
మంగళవారం రోజున మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా మరియు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, నూడా చైర్మన్ కేశ వేణు, పిసిసి ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి కి నిజామాబాద్ జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది అని, ఆయన ఒక పుట్టినరోజును నిజాంసాగర్ లో జరుపుకున్నారు అని, అదేవిధంగా గుత్ప అలీ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత వైయస్ రాజశేఖర్ రెడ్డి ది అని ఆయన అన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉంటే జాతీయ కాంగ్రెస్లో ఉన్నత స్థాయిలో ఉండేవారు అని రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వంలో ఉన్నప్పుడు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ని రాష్ట్ర నాయకులుగా తీర్చిదిద్దింది ఆయనే అని ప్రస్తుతం ఆయన శిష్యుడుగా మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు అని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరు అని, ఆయన ఆశయాలను ఆలోచనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకు వెళ్తున్నారని దానికి మనందరం మద్దతుగా ఉండాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నూడా చైర్మన్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన నాయకుడని రైతులకు 24 గంటల విద్యుత్ అందించిన ఘనత రాజశేఖర్ రెడ్డి అని ఆయన అన్నారు, విద్యార్థుల చదువుల కోసం స్కూల్ షిప్ లు అందించి ఎంతో మందికి ఉచిత విద్యుత్ అందించాడని,రాష్ట్రాన్ని ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లిన నాయకుడని ఆయన అన్నారు. ఈ సందర్భంగా రామ్ భూపాల్ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి సేవలు మరువలేనివి అని,జిల్లాకు ఎత్తిపోతల పథకాలు అందించి సాగు తాగు నీరు అందించాడని ఆయన అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చారని ఆయన మార్గంలోనే రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా టి సెల్ అధ్యక్షులు యాదగిరి,సేవాదళ్ అధ్యక్షులు సంతోష్,జిల్లా ఫిషర్మాన్ చైర్మన్ శ్రీనివాస్,నగర సి సెల్ అధ్యక్షులు వినయ్, సి సి డెలిగేట్ లవంగ ప్రమోద్,స్వామి గౌడ్,ముశ్షు పటేల్,సంగెం సాయిలు మరియు తదితరులు పాల్గొన్నారు
