
పయనించే సూర్యుడు బాపట్ల మే:-7 రిపోర్టర్ (కే శివకృష్ణ )
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు రద్దు చేయడం, ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్నవి తరలిపోవడం, నిరుద్యోగ భృతి రద్దు వంటి జగన్ ప్రభుత్వ చర్యలతో యువత రోడ్డున పడ్డారు. నిరాశా నిస్పృహలతో బెట్టింగ్, డ్రగ్స్ వంటి వాటికి అలవాటుపడి ఉజ్వలమైన భవిష్యత్ ను ధకారమయం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువత సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెట్టి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. గడిచిన 11 నెలల్లో 16,347 పోస్టులతో మెగా డీయస్సీ, 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ, రూ.8.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. సులభంగా అధిగ నగదును ఆర్జిoచవచ్చు అంటూ బెట్టింగ్ లోకి దిగడం, లోన్ యాప్స్ ను ఆశ్రయించి మీ భవిష్యత్ ను అంధకారమయం చేసుకోవద్దు. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం, చట్ట వ్యతిరేకం.. అన్న విషయాన్ని యువత
గుర్తుంచుకోవాలి. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో బెట్టింగ్, లోన్ యాప్ ల సంస్కృతి పెరిగిపోయింది. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఆపరేషన్ ఈగిల్ కార్యక్రమాన్ని చేపట్టి గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపడం జరిగింది.సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలతోగానీ, స్నేహితులు చెప్పే మాటలతో గానీ ఎవరూ బెట్టింగ్ యాప్ లు, లోన్ యాప్ ల జోలికి వెళ్లవద్దు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని యువత భవిష్యత్ ను బంగారమయం చేసుకోవాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ఒప్పందాలతో యువతకు పెద్ద ఎత్తున ఒప్పంద అవకాశాలు లభిస్తాయి. మీ తల్లిదండ్రలు ఆశయ సాధన కోసం, వారి ఆనందం కోసం ఉన్నత లక్ష్యాల వైపు
యువత పయనించాలని T.N.SF పిలుపునిస్తోంది.ఈ కార్యక్రమంలో T N.S.F పార్లిమెంట్ సెక్రటరీ పరిస గోపి,తెలుగుయువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉడత దేవేందర్ బాలాజీ,కరి సుధీర్ తదితర TNSFయువత నాయకులు పాల్గొన్నారు.