Tuesday, September 2, 2025
Homeఆంధ్రప్రదేశ్వై యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన వైస్సార్సీపీ నాయకులు

వై యస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించిన వైస్సార్సీపీ నాయకులు

Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

యాడికి మండల కేంద్రలోని శాంతి నగర్ వద్ద ఉన్నటువంటి వైస్సార్ సర్కిల్ లో జనహృదయ నేత పేదల ఆశాజ్యోతి వై యస్ రాజశేఖర్ రెడ్డి గారి 16వ వర్ధంతి సందర్బంగా అయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన వైస్సార్సీపీ సీనియర్ నాయకులు బొంబాయి రమేష్ నాయుడు గారు, స్టేట్ జాయింట్ సెక్రటరీ వెన్నపూస వెంకటరామి రెడ్డి, గారు మాట్లాడుతూ మహనీయులు రాజశేఖర్ రెడ్డి గారు అమలు పరిచిన పథకాలను గుర్తు చేసుకొంటూ కుటుంబంలో ప్రతి ఒక్కరికి లబ్ది జరిగేలా ఫీజు రియంబెర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, వంటి పథకాల ద్వారా ప్రజలలో ఎనలేని ఆధారణ పొందిన ఏకైక వ్యక్తి వై యస్ రాజశేఖర్ రెడ్డి గారే అని కొనియాడారు ఇలాంటి మహనీయుడని ప్రజలు కొన్ని తరాలు మారిన మరిచి పోలేరని తెలిపారు అలాగే రాబోయే కాలంలో వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేసుకొంటేనే మల్లి రాజశేఖర్ రెడ్డి గారి పాలన మనం చూడగలం అని తెలిపారు మరియు ఈ కార్యక్రమలో జిల్లా ఉపాద్యక్షురాలు లక్ష్మీదేవి, మండల కన్వీనర్ సంజీవరాయుడు,బ్రహ్మానందరెడ్డి, బాల రమేష్ బాబు, ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, అవుకు నాగరాజు, గొడ్డుమర్రి రామమోహన్, పామిశెట్టి నాగరాజు, కొమ్మ ప్రసాద్ రెడ్డి, వెంకటరామిరెడ్డి వార్డ్ సభ్యులు గుంత తిరుపతి, మేకల రామచంద్ర, గజ్జి బాలపెద్దయ్య, దాసరి శ్రీధర్, మిద్దె నరేంద్ర మరియు చిట్టెం రెడ్డి బాలరెడ్డి, కోట చౌదరి, ఉప్పలపాడు బాల గంగయ్య, గుర్రాల శివయ్య, రాముడు, కంభగిరి, పొంతల కిట్టయ్య,రాయలచెరువు తలారి నాగేష్, శివయ్య,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రియతమ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments