
అదృశ్య మైన వ్యక్తి గోసం సాయిలు..
రుద్రూర్, ఏప్రిల్ 6 : (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామానికి చెందిన గోసం సాయిలు (40) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు రుద్రూర్ ఎస్ఐ సాయన్న తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. సాయిలు ప్లాస్టిక్ డబ్బాలు సేకరించడం, బిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించేవాడని, గత నాలు గు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. వివిధ ప్రాంతాల్లో వెతికినప్పటికీ సాయిలు ఆచూకీ లభించలేదని సాయిలు తమ్ముడు శంకర్ శనివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఎస్సై సాయన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.