
( పయనించే సూర్యుడు ఏప్రిల్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొందుర్గ్,చౌదర్ గూడెం మండలాల రైతులకు సబ్సిడీ పై మంజూరైన 14 యూనిట్ల తైవాన్ పవర్ స్పియర్ పంపులను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు రాజరత్నo,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,కొందుర్గ్ మండలం పార్టీ అధ్యక్షుడు కృష్ణ రెడ్డి,బాలరాజు గౌడ్,కరుణాకర్, ఇబ్రహీం,చౌదరి గూడ మండల వ్యవసాయ అధికారి రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.