
అశ్వాపురం మాజీ సర్పంచ్ శారద
పయనించే సూర్యుడు, అశ్వాపురం, ఫిబ్రవరి 20: అశ్వాపురం వ్యవసాయ అధికారి శంతన్ కుమార్ నిజాయితీగల వ్యవసాయ అధికారి. రైతులకు అందుబాటులో ఉండే వ్యవసాయ అధికారి. రైతుల విషయంలో ఎటువంటి విత్తనాలు వేస్తే దిగుబడిని ఇస్తాయి రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుద్ది అని రైతుల గురించి ఆలోచించే వ్యక్తి అటువంటివారు ఈ విధంగా జరిగిందని విని ఇది నిజం కాదేమో అనిపిస్తోంది. ఇది నమ్మశక్యంగా లేదు, అశ్వాపురం మండలానికి వ్యవసాయ అధికారిగా వచ్చినప్పటి నుండి ప్రతి రైతుకు సుపరిచితులు రైతుకు ఏ ఇబ్బందులు ఉన్న పంట సమస్యలు ఉన్న వెంటనే స్పందించే అధికారి అయన రైతులకు రైతుబంధు,రైతు బీమాలాంటి ఇబ్బందులు ఉన్న వెంటనే స్పందించే గుణం అయినది ఎక్కడ ఎప్పుడు ఏ రైతు దగ్గర లాలూచీ పడని కడిగిన ముత్యం లాంటి అధికారి ఆయన ను కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజలకు సేవ చేసే మంచి అధికారిని ఎ సి బి దాడులు చేసే కుట్ర చేయడం ఎంతవరకు సమంజసం అంటూ అశ్వాపురం మాజీ సర్పంచ్ శారద ఖండించారు.