
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 02 (పొనకంటి ఉపేందర్ రావు )
మంగళవారం టేకులపల్లి లో కోత్తగూడెం ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ పర్యటించి వ్యవసాయ కార్యాలయం ను సందర్శించి వ్యవసాయ శాఖ యొక్క విధులు, క్రమంలో అడిగి తెలుసుకున్నారు. మండలంలో రైతులు సాగు చేస్తున్న విధానాన్ని, భౌగోలిక స్వరూపం. నూతన పద్ధతులు, నేలల స్వభావం, పంటల విస్తీర్ణం రైతు భరోసా రైతు భీమా పధకాల అమలు, మార్కెటింగ్ క్రాప్ లోన్, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, వరి కొనుగోకేంద్రాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోలియాతండా గ్రామంలో ప్రత్తి సాగు చేస్తున్న రైతును ఎంత పెట్టు బడిపెట్టారు. ఎంత దిగుబడి వస్తుంది అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో
ఇల్లందు ఏడిఏ లాల్ చందు, ఎంఏఓ ఎన్.అన్నపూర్ణ,ఏఈ ఓ లు శ్రావణి, విశాల, రమేష్, ప్రవీణీ మరియు రైతులు పాల్గొన్నారు.