
రుద్రూర్, నవంబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
: బోధన్ నుండి శబరిమలై వరకు అయ్యప్ప స్వాములు మహాపాదయాత్ర ప్రారంభించారు. శనివారం బోధన్ మీదుగా రుద్రూర్ గ్రామానికి చేరుకున్నారు. రుద్రూర్ గ్రామ అయ్యప్ప స్వాములు వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అయ్యప్ప స్వాములకు పండ్లు పంపిణీ చేశారు. పాదయాత్ర చేసే వారిలో దుర్కి చిన్న గంగారాం స్వామి, జుక్కల్ వార్ గంగాధర్ స్వామి, కోట్న లక్ష్మణ్ స్వామి, దాసరి శ్రీనివాస్ స్వామి, చెరుకుల నారాయణస్వామి, కంచోజు సత్యనారాయణ స్వాములు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్ సెట్, పత్తి రాము, ఇందూర్ కార్తిక్, పార్వతి మురళి, తోట సంగయ్య తదితరులు పాల్గొన్నారు.